Janasena Twitter Accountsపై సస్పెన్షన్ తొలగింపు... థ్యాంక్స్ చెప్పిన పవన్
పార్టీకి చెందిన వందలాది ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా పోరాటాలు సాగిస్తూ.. యవతరంలో చైతన్యం నింపుతున్న తమ అకౌంట్లను సస్పెండ్ చేయడం పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన మద్దతుదార్లకు చెందిన 400 ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటో తనకు అర్థం కావడం లేదంటూ జనసేనాని ట్వీట్ చేశారు. నిస్సహాయకులకు అండగా ఉండటం, వారి సమస్యలపై గళమెత్తడమేనా మేం చేసిన తప్పు అని జనసేనాని ప్రశ్నించారు. జనసేన సోషల్ మీడియాను తిరిగి వెనక్కి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంలో ట్విట్టర్ జనసైనికులు ఊరటనిచ్చింది. జనసేన అకౌంట్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ఈ విషయాన్ని జనసేన అధిననేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ ఇండియాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన భావస్వేచ్ఛా ప్రకటనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. జనసేన ఖాతాలపై సస్పెన్షన్ తొలగించడంలో ట్విట్టర్ ఇండియా రెస్పాన్స్ బాగుందని ఆయన తెలిపారు. Read Also: సస్పెన్షన్‌కు గురైన ట్విట్టర్ ఖాతాలు తిరిగి సాధారణంగా పని చేస్తుండటంతో.. జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మా బలం, ఒక్క ట్వీట్‌తో 400 ట్వీట్లపై సస్పెన్షన్ ఎత్తివేయించారని పవన్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
By September 20, 2019 at 09:24AM
No comments