Hyderabad: మద్యం మత్తులో మహిళపై అత్యాచారం.. దారుణహత్య
చేస్తుంటే ప్రతిఘంటించిందన్న కోపంతో ఓ కామాంధుడు ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఈ నెల 11వ తేదీన ఈ ఘటన జరగ్గా పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. Also Read: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన మహిళ(43) భర్తతో కలహాల కారణంగా హైదరాబాద్ చంపాపేటలో ఉంటున్న సోదరి కుమార్తె వద్దకు వచ్చి ఉంటోంది. సైదాబాద్, చంపాపేట పరిసరాల్లోని ఫంక్షన్‌హాళ్లలో దినసరి కూలీగా పనిచేస్తోంది. ఈనెల 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. దీంతో ఆమె బంధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 13వ తేదీన ఐఎస్‌సదన్ డివిజన్ వినయనగర్‌కాలనీలోని బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్ సమీపంలో ఆ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దుండుగులు ఆమెపై అత్యాచారం చేసి చంపేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 300 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించిన సైదాబాద్ పోలీసు ప్రత్యేక బృందం, టాస్క్‌పోర్స్ పోలీసులు నిందితుడిని నల్గొండ జిల్లా చందంపేట మండలం పోల్యానాయక్ తండాకు చెందిన రమావత్ శుక్రూ నాయక్‌గా గుర్తించారు. Also Read: 11వ తేదీన రాత్రి సమయంలో ఆ మహిళకు మద్యం దుకాణం వద్ద శుక్రూ నాయక్ పరిచయమయ్యాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత ఆమెను బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో రాళ్లతో కొట్టాడు. అపస్మారకస్థితికి చేరుకున్న బాధితురాలిపై అత్యాచారం చేసి బండరాయితో తలపై కొట్టి చంపేసి పరారైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం పనికోసం చంపాపేటకు వచ్చిన నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By September 24, 2019 at 09:49AM
No comments