అమీర్‌పేటలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సోమవారం ఉదయం ఆర్టీసీ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్ నుంచి బాచుపల్లి వెళ్తున్న మియాపూర్-1 డిపో బస్సు ముందు చక్రం దగ్గరకు వచ్చేసరికి టైర్ పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేక పక్కనే ఉన్న దుకాణాల వైపు మళ్లించాడు. దీంతో బస్సు దుకాణాలను ఢీకొని ఆగిపోయింది. Also Read: ఈ ఘటనలో ముగ్గురు మహిళలు గాయపడినట్లు తెలుస్తోంది. ఉదయం వేళ కావడంతో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు లేరు. డ్రైవర్ చాకచక్యంతో దుకాణాల వైపు బస్సును మళ్లించడంతోనే పెను ప్రమాదం తప్పిందని, జనాల వైపు దూసుకెళ్తే ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు పునరుద్ధరించారు. Also Read: అమీర్‌పేట మెట్రోస్టేషన్ వద్ద ఆదివారం పెచ్చులూడి మౌనిక అనే వివాహిత ప్రాణాలు కోల్పోయిన ఘటన నగరంలో సంచలనమైంది. వర్షం పడటంతో మెట్ల దగ్గర వేచిచూస్తున్న మౌనికపై రెండో అంతస్తు నుంచి పెచ్చులూడి తలపై పడ్డాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనతో భాగ్యనగరానికే మణిహారంగా ప్రభుత్వం చెప్పుకునే మెట్రోస్టేషన్ నిర్మాణంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటన జరిగిన 24గంటలు గడవక ముందే అమీర్‌పేటలోనే ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించడంతో నగరవాసులు షాకయ్యారు. Also Read:
By September 23, 2019 at 11:14AM
No comments