Breaking News

పాక్ కాన్సులేట్‌లో భారత్‌ వ్యతిరేక బ్యానర్లు.. దాయాదికి ఝలక్ ఇచ్చిన ఇరాన్!


కశ్మీర్ అంశంలో రాద్దాంతం చేస్తున్న పాకిస్థాన్‌కు ఇస్లామిక్ దేశాలు సైతం షాక్ ఇచ్చాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని భారత్‌ రద్దుచేసినా ఆ దేశాలు దీనిని అంతర్గత విషయంగా పేర్కొన్నాయి. తాజాగా, పాకిస్థాన్‌కు గల్ఫ్ దేశం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశంలోని పాక్ రాయబార కార్యాలయం వద్ద భారత్‌కు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన బ్యానర్లను ఇరాక్ ప్రభుత్వం తొలగించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. మషాద్‌ నగరంలోని పాక్‌ రాయబార కార్యాలయంలో ఆగస్టు 15న భారత్‌ వ్యతిరేకంగా ‘కశ్మీరీ సంఘీభావం దినం’ అంటూ బ్యానర్లు పాక్ ఏర్పాటు చేసినట్లు తెలియడంతో వెంటనే స్థానిక పోలీసులు అర్దరాత్రి వాటిని బలవంతంగా తొలగించారు. బ్యానర్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన ఇరాన్.. ఇది దౌత్య నిబంధనలకు విరుద్ధమైన చర్యలుగా అభివర్ణించింది. తమ దేశంలోని దౌత్య కార్యాలయాలను మూడో దేశానికి వ్యతిరేకంగా వినియోగించనీయమని స్పష్టం చేసింది. ఇరాక్ చర్యలతో పాక్‌కు ఆశాభంగం తప్పలేదు. దీంతో పాక్ అధికారులు లెవనెత్తగా, ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ‘ఇస్లామాబాద్‌లోని మా రాయబార కార్యాలయం వద్ద సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా బ్యానర్లు కడితే మీరు ఎలా స్పందిస్తారు? దీనిని అంగీకరిస్తారా? ’ అని నిలదీసింది. దీనికి పాక్ తలబిరుసుగా సమాధానం ఇవ్వడం గమనార్హం.‘మా రాయబార కార్యాలయ హక్కుల మేరకే వీటిని ప్రదర్శించాం’ అని పేర్కొంది. ‘పాక్‌ మాకు సోదర దేశమైనా భారత్‌ మాకు శత్రువు కాదు. కశ్మీర్‌ విషయంలో మా వైఖరి ఏ మాత్రం మారదు’ అని ఘాటుగానే బదులిచ్చింది. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. కశ్మీర్‌ అంశం భారత్‌ అంతర్గతమని ఇరాన్‌ ఇప్పటికే తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. పాక్‌ రాయబార కార్యాలయం చర్యలపై తీవ్రంగా పరిగణించిన భారత్.. ఇరాన్‌కు నిరసన తెలియజేసింది. ఢిల్లీలోని ఇరాక్ రాయబారికి నిరసన నోటీసును అందజేసింది. ఈ ఘటనకు ముందు గతంలో ఇరాన్‌లోని పాక్‌ దౌత్యకార్యాలయం ఎటువంటి అనుమతులు లేకుండానే భారత్‌‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది. కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న ... వివిధ దేశాల మద్దతు కూడగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లెవనెత్తేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ సమర్దంగా తిప్పికొడుతోంది. కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని గట్టిగా సమాధానం ఇస్తోంది. పాక్ ప్రయత్నాలకు ఎవరు మద్దతు తెలపకపోవడంతో దాయాది మరింత అక్కసు పెంచుకుంటోంది. ఇందులో భాగంగా గత వారం లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం ఎదుట కూడా కశ్మీరీలు చేపట్టిన ఆందోళనలకు మద్దతు తెలిపింది. దీనిని హైజాక్ చేయాలని చూసిన పాకిస్థాన్‌కు ఆందోళనకారులు ఊహించని షాకే ఇచ్చారు. అక్కడకు వచ్చిన పాక్ ప్రతినిధులపై కోడిగుడ్లు, చెప్పులు విసిరి అక్కడ నుంచి పారిపోయేలా చేశారు.


By September 10, 2019 at 10:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iran-removes-anti-india-banner-form-pakistan-consulate-in-mashhad/articleshow/71059910.cms

No comments