ఆ భామతో ముచ్చటగా మూడోసారి.. బాలయ్య సెంటిమెంట్!
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ఆయన 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు ‘జైసింహా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రమిది. ఇటీవల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. సెప్టెంబర్ 5 నుండి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో ఈ చిత్రంలో కనపడతారు. ఇటీవల విడుదలైన ఓ లుక్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కాగా, వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ రెండు పోస్టర్స్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఒక పోస్టర్‌లో బాలయ్య హెలీకాప్టర్ నుంచి దిగుతున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్‌లోనే ఈ పోస్టర్ ఉంది. ఇక రెండో పోస్టర్‌లో సోనాల్ చౌహాన్‌తో బాలయ్య స్టెప్పేస్తున్నారు. బాలయ్య సినిమాలో సోనాల్ నటించడం ఇది మూడోసారి. ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో బాలకృష్ణ సరసన నటించింది. ‘లెజెండ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ‘డిక్టేటర్’ పర్వాలేదనిపించింది. అందుకే ఇప్పుడు సెంటిమెంట్‌గా సోనాల్‌కు బాలయ్య మూడోసారి అవకాశం ఇచ్చినట్టున్నారు. సోనాల్ చౌహాన్‌తో పాటు వేదిక మరో హీరోయిన్‌గా నటిస్తోంది. వేదికకు తెలుగులో ఇది నాలుగో సినిమా. ‘విజయదశమి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. ‘బాణం’, ‘దగ్గరగా దూరంగా’ చిత్రాల్లో నటించింది. ఇప్పుడు బాలయ్య సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
By September 01, 2019 at 12:47PM
No comments