Breaking News

అది బాంబు పేలుడు కాదు.. ఎవరూ భయపడొద్దు: డీసీపీ


రాజేంద్రనగర్‌లో జరిగిన పేలుడు ఘటనపై ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని శంషాబాద్ డీసీసీ ప్రకాశ్‌రెడ్డి సూచించారు. ఆ ప్రాంతంలో జరిగింది బాంబు పేలుడు కాదని, కెమికల్స్‌తో నిండిన బాక్స్ తెరవగానే పేలడంతోనే భారీ శబ్ధం వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని స్థానికంగా చిత్తు కాగితాలు ఏరుకునే అలీగా గుర్తించినట్లు తెలిపారు. Also Read: తీవ్రగాయాల పాలైన అలీ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని డీసీపీ తెలిపాడు. అలీ ఆ బాక్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న దానిపై విచారణ చేస్తున్నామని వెల్లడించారు. రాత్రి ఈ మార్గంలో వినాయక విగ్రహాల ఊరేగింపు జరిగిందని, అందులో పాల్గొన్న వారెవరైనా ఈ బాక్స్‌ను అక్కడ వేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. Also Read: వివిధ ప్రాంతాల్లో చెత్తను ఏరుకొని వచ్చిన అలీ పీవీ ఎక్స్‌ప్రెస్ వే 279 పిల్లర్ వద్ద పుట్‌పాత్ వద్ద కవర్‌లో తీసి బాక్స్‌ను తెరవగానే భారీ శబ్దంతో పేలిందని వెల్లడించారు. శబ్ధం వినిపించగానే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బాంబు పేలుడు జరిగిందని భయపడ్డారని, అందువల్లే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారన్నారు. వాసులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సూచించారు.


By September 08, 2019 at 02:45PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/no-bomb-blast-in-rajendra-nagar-its-only-chemical-substance-explosion-says-dcp/articleshow/71034110.cms

No comments