Breaking News

ఉపాధ్యాయ దినోత్సవం.. గురువులకు శుభాకాంక్షలు చెప్పండిలా


‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ’’.. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంతిచ్చినా రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభ‌వ‌, పితృదేవోభ‌వ‌, ఆచార్యదేవోభవ అన్నారు. నేపథ్యంలో.. ఈ కొటెషన్లతో శుభాకాంక్షలు తెలియజేద్దాం! • నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుగారికి.. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులకి.. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ. లేకపోతే అట్టి చదువరికి, చెదపురుగుకు తేడా లేదు. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం. అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • అనుభవాల క్రమమే ‘జీవితం’ అనుభవమే ‘గురువు’ - స్వామి వివేకానంద. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు. మాకు మాత్రం మీరే కథానాయకులు.. మీరే, మా ప్రేరణ! - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో.. భూమిని చూసి ఓర్పును నేర్చుకో... చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో.. ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో.. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి.. - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ: - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే... మంచి విద్యావంతులను తయారు చేయగలడు!! - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం - అబ్దుల్ కలాం - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు • విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


By September 05, 2019 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/survepalli-birth-anniversary-teachers-day-2019-wishes-images-quotes-and-messages-in-telugu/articleshow/70986908.cms

No comments