రమ్యకృష్ణ రూపంలో ‘అమ్మ’ వస్తోంది!
నటిగా సౌత్‌లో ఓ వెలుగు వెలిగిన జయలలిత అలియాస్ ‘అమ్మ’.. రాజకీయాల్లో ఎలా రాణించిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా సుమారు 14 పాటు తమిళనాడు రాష్ట్రాన్ని ఏలి.. కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన ‘అమ్మ’ తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు శోకసంద్రలో మునిగిపోయారు.
అమ్మ చెరిగిపోని జ్ఞాపకాలను సినిమా రూపంలో తీసుకురావడానికి దర్శకనిర్మాతలు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బయోపిక్ తీస్తున్నట్లు ఒకరిద్దరు తమిళ డైరెక్టర్లు ప్రకటించగా.. గౌతమ్ మీనన్ ‘క్వీన్’ టైటిల్‌తో వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో జయలలితగా సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
ఈ ఫస్ట్‌లుక్ ఓ బహిరంగ సభలో రీల్ ‘అమ్మ’ మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆమె ఆహార్యం.. జుట్టు మొత్తం జయలలితనే తలపిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను వీలైనంత త్వరలోనే అభిమానుల ముందుకు తేవడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి జయలలిత పాత్రను మాత్రమే రివీల్ చేసిన దర్శకుడు మున్ముంథు ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తారన్నది క్లారిటీ ఇవ్వనున్నారు. అంటే రియల్ లైఫ్‌లో చనిపోయిన అమ్మ.. రీల్‌లో రమ్యకృష్ణ రూపంలో వస్తోందన్న మాట.
By September 08, 2019 at 04:58AM
No comments