Breaking News

నన్నూ జర పట్టించుకోండి అంటున్న అనుపమ!


సినిమాల్లో అవకాశాలు వస్తుంటే అన్నీ సాఫీగానే ఉంటాయ్.. కాస్త తేడా కొట్టినా.. అనుకున్నది జరగకపోయినా డిస్టబ్ అయ్యే ఆ మూడ్, నటీనటులు ప్రవర్తించే తీరును ఒక్కోసారి చూడటానికి చాలా ఇబ్బందిగా జనాలు ఫీలవుతుంటారు. అయితే ఈ మధ్య నటీమణులు మాత్రం ‘నన్నూ జర పట్టించుకోండి.. నేను ఇంకా సినిమాల్లోనే’ ఉన్నామన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా వేదికను యమా వాడిపారేస్తున్నారు.

ఇలాంటి వారిలో ‘ప్రేమమ్‌’ బ్యూటీ, టీనేజ్‌ సుందరిగా పేరుగాంచిన అనుపమ పరమేశ్వరన్‌ ఒకటి. మొదట ఈ ముద్దుగుమ్మ బోలెడన్ని సినిమాల్లో చేసే ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ మధ్య అస్సలు రావట్లేదు. ఒకవేళ వచ్చినా రీమేక్, చిన్నపాటి సినిమాలకే పరిమితం అవుతోంది. అయితే ఈ భామకు ఏం తక్కువైందో..? ఏం ఎక్కువైందో తెలియదు కానీ దర్శకనిర్మాతలు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు.

సోషల్ మీడియా వేదికగా లవ్ సింబల్స్‌తో హడావుడి చేయడం.. తాను ఎవరితోనో లవ్‌లో ఉన్నట్లు చిన్నపాటి హింట్ ఇస్తుండటం.. అంతేకాదు ఓ క్రికెటర్‌తో లవ్, డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రావడం ఈ కారణాలన్నీ ఈమెకు అవకాశాలు రాకుండా చేస్తున్నాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ భామకు మాత్రం తిన్నకుండా సోషల్ మీడియాలో రోజుకు రెండు మూడు మంచి హాట్ ఫొటోలు, హొయలొలికించే అందాలున్న ఫొటోలతో నెటిజన్లు, అభిమానులతో టచ్‌లో ఉంటోంది.

అంటే.. అవకాశాలెవ్వరూ ఇవ్వడం లేదని ఇటు ఇండస్ట్రీకి.. అటు మీడియాకి తానొకదాన్ని వున్నానని గుర్తు చేయడానికి ఇలా ఫొటోలు ఎడా పెడా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేస్తోందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత కష్టపడి ఫొటోలు పెడుతున్న ఈ భామను ఇకనైనా దర్శకనిర్మాతలు లెక్కచేస్తారో..? లేకుంటో అబ్బే.. మనకెందుకులే అని మిన్నకుండిపోతారో వేచి చూడాలి మరి.



By September 22, 2019 at 09:38PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47558/anupama-parameswaran.html

No comments