సకుటుంబ సమేతంగా ‘ఎవరు’ చూడొచ్చు!
ఇదేంటి.. అడివి శేష్ నటించిన హిట్ చిత్రం ‘ఎవరు’ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యిందిగా.. మళ్లీల సకుంటుంబ సమేతంగా అంటున్నారేంటి..? అని కాస్త కన్ఫూజన్‌గా ఉందా.. అక్కడికే వస్తున్నా.. అవును సినిమా రిలీజ్ అయ్యి నెలరోజులు దాటిపోయింది.. ఒకవైపు థియేటర్లలో ఆడుతుండగానే అమేజాన్ ఫ్రైమ్‌లో ప్రత్యక్షమయ్యింది. అందుకే ఇక ‘ఎవరు’ను సకుటుంబ సమేతంగా చూసేయచ్చు.. ఇక ఆలస్యమెందుకు మీరూ ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ చూసేయండి మరి.
ఇప్పటికే పలువురు సినీప్రియులు అమెజాన్‌లో కుటుంబ సమేతంగా చూసేసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇంటింటికీ టీవీ ఉన్నట్టే ఇంటింటికీ అమెజాన్ అంత ఫ్యామిలీ ఎఫెక్షన్‌తో ఏ విధంగా కనెక్టయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. భవిష్యత్ అంతా డిజిటల్ యుగందే అనేందుకు ఇంతకు మించి ప్రత్యేక సాక్ష్యం అక్కర్లేదేమో. కాగా.. ఆగస్టు 16న ఈ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే.
By September 17, 2019 at 10:10PM
No comments