వెరైటీ లవ్‌స్టోరీ.. ఒకే యువకుడితో ఇద్దరమ్మాయిల పరార్
యుక్త వయస్సులో ఉన్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం, పెద్దలు ఒప్పుకోకపోతే ఎక్కడికైనా వెళ్లిపోయి బతకడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే జిల్లా పలమనేరు మండలంలోని ఓ గ్రామంలో మాత్రం ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడితో పారిపోవడం కలకలం రేపింది. పలమనేరు మండలంలోని పందేరు ఒడ్డూరు గ్రామానికి చెందిన రాజశేఖర్(20) అనే యువకుడితో ఇద్దరు అమ్మాయిలు చనువుగా ఉండేవారు. కొన్నిసార్లు హద్దులు దాటినట్లు కనిపించడంతో అతడి తల్లి నాగమ్మ కొడుకును హెచ్చరించేది. అమ్మాయిలతో అలా ఉండటం సభ్యత కాదని చెప్పేది. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీ నుంచి రాజశేఖర్ కనిపించకుడా పోయాడు. ఇంట్లోని రూ.12వేల నగదు తీసుకుని బైక్‌తో సభా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ ఘటనపై గ్రామస్థులు ఆరా తీయగా రాజశేఖర్‌తో చనువుగా ఉండే ఇద్దరమ్మాయిలు కూడా అదే రోజు నుంచి కనిపించకుండా పోయారు. దీంతో రాజశేఖర్ ఆ ఇద్దరితోనే ఎక్కడికైనా పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. తన కుమారుడ కనిపించడం లేదంటూ యువకుడి తల్లి నాగమ్మ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్ ఆ అమ్మాయిలతొ ప్రేమ వ్యవహారం కారణంగా వెళ్లిపోయాడా? లేక వేరే కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నారు. ఈ వెరైటీ స్థానికంగా చర్చనీయాంశమైంది.
By September 12, 2019 at 10:15AM
No comments