Breaking News

‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ వార్తలపై శ్రద్ధా ఫైర్!


నన్ను సంప్రదించకుండా ఇలాంటి న్యూస్ ఎలా రాస్తారు! ఈమాటన్నది ఎవరో కాదు... టాలీవుడ్ హాటెస్ట్ హీరోయిన్ శ్రద్ధా దాస్. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫెడవుట్ అయిన హీరోయిన్. తెలుగు, తమిళ, మలయాళంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్న శ్రద్ధా దాస్ పేరు ఈ మధ్యన టాలీవుడ్ సర్కిల్స్ లో కూడా బాగానే వినబడుతుంది. ఎందుకంటే బుల్లితెర మీద ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ 3 లో శ్రద్ధా దాస్ హాట్ గా వైల్డ్ కార్డు ఎట్రీ ఇవ్వబోతుందని.. ప్రచారం మాములుగా జరగడం లేదు. శ్రద్ధా దాస్‌తో పాటుగా హెబ్బా పటేల్, ఈషా రెబ్బ పేర్లు వినబడ్డాయి.

ఇక తాజాగా శ్రద్ధా దాస్ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ.. వరుణ్ సందేశ్ వల్ల వెళ్లలేదన్నారు. కారణం వరుణ్‌కి శ్రద్ధా కి గతంలో లవ్ ఎఫైర్ ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. అయితే ఈ వార్తలన్నిటి మీద శ్రద్ధా దాస్ ఫైర్ అవుతుంది. ఇలాంటి వార్తలు రాసేముందు.. తనని సంప్రదిస్తే బావుండేదని.. అసలు ఏ విషయంలోనైనా నా కంఫర్ట్, ఇష్టం, పాజిబిలిటీ వంటి అన్ని విషయాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని.. ప్రస్తుతం తాను ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా వున్నానని చెబుతుంది. అంత బిజీగా ఉన్న నేను బిగ్ బాస్ లోకి ఎలా వెళ్తానంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.



By September 08, 2019 at 06:50AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47341/shraddha-das.html

No comments