వివేకా హత్యకేసులో ట్విస్ట్.. పోలీసులు విచారణకు పిలిచిన వ్యక్తి సూసైడ్
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయి హత్య కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు విచారణకు పిలిచిన శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. Also Read: ఈ ఏడాది మార్చి 15వ తేదీన వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. తొలుత వివేకానంద బాత్రూమ్‌లో గుండెపోటుకు గురై చనిపోయారని వార్తలు వచ్చినా పోస్టుమార్టం రిపోర్టులో ఆయన హత్యకు గురైనట్లు తేలడం సంచలనం రేపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు విచారించి ఆధారాలు సేకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఈ కేసు విచారణను వేగవంతం చేసింది. Also Read: దీనిలో భాగంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తిని విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులు పంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి బంధువు. దీంతో ఆయన్ని ఇప్పటికే పోలీసులు అనేకసార్లు విచారించారు. రెండ్రోజుల క్రితం మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. Also Read: దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు వేధించడం వల్లనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాసులరెడ్డి కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని రెండ్రోజుల క్రితం పోలీసులు విచారణకు పిలిచారని, ఆ కేసుతో సంబంధం లేకపోయినా నిందితుడిగా పోలీసులు చిత్రీకరిస్తున్నందునే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడించారు. వైఎస్ కుటుంబం అంటే తన తండ్రికి చాలా అభిమానమని తెలిపారు. ఆత్మహత్యకు ముందు శ్రీనివాసులరెడ్డి... సీఎం జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డికి రాసిన లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘వివేకానందరెడ్డి హత్యకేసుతో తనకెలాంటి సంబంధం లేదని లేఖలో ఆయన పేర్కొన్నాడు. శ్రీనివాసులరెడ్డిని సీఐ రాములు తీవ్రంగా వేధించారని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
By September 03, 2019 at 08:45AM
No comments