దసరా ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్స్.. అర్ధనగ్నంగా రెచ్చిపోయిన డ్యాన్సర్లు

దసరా ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. భక్తులను అలరించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించి అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా రాంలీలాలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి బార్ గర్ల్స్‌తో డ్యాన్సులు చేయించడం కలకలం రేపింది. రాంపూర్‌లోని మిలక్ ప్రాంతంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం డ్యాన్స్ షోకి బార్ గర్ల్స్ను రప్పించారు. బాలీవుడ్ పాటలకు వారు అర్ధనగ్నంగా రెచ్చిపోతూ డ్యాన్సులు చేశారు. డ్యాన్సర్లు జనాల వద్దకు వెళ్లి అంగాంగ ప్రదర్శన చేస్తుంటే వారేమో అమ్మాయిల మీదకు డబ్బులు వెదజల్లారు. తెల్లవారుజాము వరకు రికార్డింగ్ డ్యాన్సులు కొనసాగుతూనే ఉన్నాయి. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బార్ గర్ల్స్‌తో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడమేంటని కొందరు నిర్వాహకులపై మండిపడుతున్నారు. ఈ డ్యాన్స్ షోకు తమ నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని అధికారులు చెప్పారు.
By September 30, 2019 at 12:06PM
No comments