కీచక కాంపౌండర్.. ఆపరేషన్ థియేటర్‌లోనే యువతిపై రేప్
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన యువతిపై కన్నేశాడో కాంపౌండర్. డాక్టర్ రావడానికి లేట్ అవుతుందని, అప్పటివరకు ఆపరేషన్ థియేటర్‌లో ఉండాలని నమ్మించి మత్తు ఇంజక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో గురువారం జరిగింది. Also Read: మథురకు చెందిన ఓ యువతి(22) కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స కోసం స్థానికంగా ఓ ఆస్పత్రికి వెళ్లింది. ఆమె వివరాలు నమోదు చేసుకున్న కాంపౌండర్ రాజు.. డాక్టర్ కాసేపట్లో వస్తారని వెయిట్ చేయాలని చెప్పాడు. అయితే ఒంటరిగా వచ్చిన ఆమెపై అతడు కన్నేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెకు కడుపునొప్పి ఎక్కువ కావడంతో బాధతో విలవిల్లాడింది. దీంతో కాంపౌండర్ ఆమెను ఆస్పత్రి థియేటర్‌కు తీసుకెళ్లి ఇంజక్షన్ ఇవ్వబోయాడు. ఆమె అదేంటని ప్రశ్నించగా ఆ ఇంజక్షన్ తాత్కాలికంగా బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పడంతో సరేనంది. Also Read: ఇంజక్షన్ ఇచ్చిన కాసేపటిలో ఆ యువతి మత్తులోకి జారుకుంది. ఇదే అదనుగా భావించిన కాంపౌండర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తులో నుంచి తేరుకున్న బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందిన తెలుసుకుని షాకైంది. చికిత్స కోసం వస్తే తన జీవితాన్ని నాశనం చేశాడని రాజుపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. Also Read:
By September 22, 2019 at 10:11AM
No comments