Breaking News

ఎవరికి క్షమాపణ చెప్పాలో అర్థం కావడం లేదు: హరీష్ శంకర్


‘వాల్మీకి’ సినిమా టైటిల్‌ను మార్చాలని బోయ, వాల్మీకి సంఘాలు సినిమా ప్రారంభం నుంచి ఆందోళన చేస్తున్నాయి. అయినప్పటికీ సినిమాలో వాల్మీకి మహర్షిని కించపరిచే విధంగా కంటెంట్ ఏమీ లేదనే ధైర్యంతో హరీష్ శంకర్, నిర్మాతలు ముందుకు వెళ్లారు. కానీ, విడుదలకు ఒక్కరోజు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ‘వాల్మీకి’ సినిమా విడుదలను ఆపాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు దర్శక, నిర్మాతలకు షాక్ ఇచ్చాయి. దీంతో వారు టైటిల్ మార్చాలని నిర్ణయించారు. ‘వాల్మీకి’ని ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. ఈ విషయాన్ని వెల్లడించడానికి గురువారం రాత్రి హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టారు. ఈ సమావేశంలో దర్శకుడు హరీష్ శంకర్ కాస్త ఎమోషనల్‌గా మాట్లాడారు. ‘‘వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొన్ని వర్గాల వారి నుంచి నిరసనలు మొద‌ల‌య్యాయి. వాల్మీకి మ‌హ‌ర్షి త‌ప్పు చేసిన‌ట్లు సినిమాలో ఎక్కడా చూపించ‌లేదు కాబ‌ట్టి రేపు సినిమా చూసిన త‌ర్వాత కచ్చితంగా ఎవ‌రైతే నిర‌స‌న‌ను తెలియ‌జేశారో, వారి మ‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని బాధ‌ప‌డుతున్నారో వారు క‌చ్చితంగా మ‌మ్మల్ని మెచ్చుకుంటార‌నే న‌మ్మకంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంత‌రాలుంటే సెన్సార్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌నుకున్నాం. సెన్సార్ స‌భ్యులు సినిమా చూశారు. వాల్మీకి మ‌హ‌ర్షి గురించి ఎక్కడా త‌ప్పుగా చెప్పడం కానీ.. చూపించ‌డం కానీ లేదు కాబ‌ట్టి.. స‌గం ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింద‌ని అనుకున్నాం. అయితే బోయ‌ సంఘం వారు, వాల్మీకి వ‌ర్గం వారు టైటిల్‌లో తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్యక్తం చేశారు. దాన్ని మార్చాం. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లా క‌లెక్టర్ ఆఫీసుల నుంచి సినిమా రేపు రిలీజ్ అన‌గానే సినిమాను ఆపేయాలంటూ ఉత్తర్వులు మాకు వ‌చ్చాయి. ఈ స‌మ‌స్యను ఎలా అధిగ‌మించాల‌ని నేను, మా నిర్మాత‌లు 14-15 గంట‌లు పాటు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాం. ఈ ప‌రిస్థితిని కావాల‌నే ఎవ‌రూ తెచ్చుకోరు. మేం ఓ మంచి టైటిల్‌ను పెట్టాం. ఇలాంటి టైటిల్‌ను పెట్టడం ద్వారా వాల్మీకి మ‌హ‌ర్షి గొప్పత‌నం తెలియ‌నివారికి కూడా తెలుస్తుంద‌ని అనుకున్నాం. Also Read: రూ. 30-40 కోట్లు ఖ‌ర్చుపెట్టి 200 మంది టెక్నీషియ‌న్స్ ఓ వ్యక్తినో, వ‌ర్గాన్నో, కులాన్నో, ఓ సంఘాన్నో విమ‌ర్శించడానికి ఈ ప‌నిచేయ‌లేదు. వాల్మీకి మ‌హ‌ర్షి గురించి రెండు గొప్ప డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నా సినిమాలు చూడ‌ని మా నాన్నగారు కూడా తొలిసారి టైటిల్ అనౌన్స్ చేయ‌గానే.. చాలా మంచి టైటిల్ పెట్టావ‌ని ఆయన ఫోన్ చేశారు. సినిమా ఎలా ఉందో తెలియ‌కుండా నేను ఎవ‌రికి క్షమాప‌ణ చెప్పాలో అర్థం కావ‌డం లేదు. ఏ జిల్లాలో ఈ సినిమాను ఆపాల‌ని నిర్ణయం తీసుకున్నారో దాని వ‌ల్ల అక్కడ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్టపోతారు. వారికి ఎలాంటి న‌ష్టం జ‌రగ‌కూడ‌ద‌ని భావించాం. నేను ముందు ఈ దేశ పౌరుడ్ని. త‌ర్వాతే డైరెక్టర్‌ని.. రైట‌ర్‌ని. ఏ వ్యక్తి కూడా ప్రభుత్వానికి అతీతులు కాద‌ని న‌మ్మే వ్యక్తిని. సినిమాను చూడకుండా ఇంత డిస్ట్రబ్ చేయ‌డమ‌నేది చిన్న బాధ‌ను క‌లిగిస్తుంది. అంద‌రికీ చెప్పేదొక్కటే ‘వాల్మీకి’ టైటిల్‌ను ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్‌’గా ప‌రిగ‌ణించాల‌ని కోరుతూ టైటిల్‌ను మారుస్తున్నాం. ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్ అంతా కొత్త టైటిల్‌తోనే ముందుకు వ‌స్తుంది. ఎవ‌రి మ‌నోభావాలైతే దెబ్బతిన్నాయ‌న్నారో వారికి నేను స‌విన‌యంగా చెప్పేదొక్కటే.. వాల్మీకి సోద‌రులారా, బోయ సోద‌రులారా మీరు నా సినిమాను చూడాల‌ని కోరుతున్నాను. సినిమా చూసిన త‌ర్వాత ఏదో మూల నిజ‌మే క‌దా! వాల్మీకి మ‌హర్షిని ఎక్కడా త‌ప్పుగా చూపించ‌లేదని మీ అంతరాత్మకు అనిపిస్తే నాకు అదే చాలు. అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. మొదటిసారి తాను ఓడిపోయానని అనిపిస్తోందని హరీష్ శంకర్ భావోద్వేగానికి గురయ్యారు. ఓడిపోవడం అంటే వ్యక్తిగతంగానో, ఒక డైరక్టర్‌గానో, ఒక రైటర్‌గానో కాదని.. ఒక హైందవ సమాజానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి మీద ఉన్న ఒక గొప్ప గౌరవాన్ని, ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తాను ఓడిపోయానని తనకు అనిపిస్తోందని అన్నారు.


By September 20, 2019 at 06:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-harish-shankar-emotional-speech-on-valmiki-title-changed-into-gaddala-konda-ganesh/articleshow/71210879.cms

No comments