‘పహిల్వాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలివే!
శాండిల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పహిల్వాన్’. ఎస్.కృష్ణ దర్శకుడు. ఈ యాక్షన్ డ్రామాలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల 5 భాషల్లో విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ‘పహిల్వాన్’ అనే పేరుతో వారాహి చలనచిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సాయికొర్రపాటి తెలుగులో సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ‘పహిల్వాన్’ ఫస్ట్ టికెట్‌ను పి.వి.సింధు, బోయపాటి శ్రీను ఖరీదు చేశారు.
ఈ సందర్భంగా వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్ పి.వి.సింధు మాట్లాడుతూ.. ‘‘పహిల్వాన్ వంటి సినిమాలు అందరికీ స్ఫూర్తినిస్తాయి. హార్డ్‌వర్క్ ఎప్పటికైనా సక్సెస్‌ను సాధిస్తుంది. మన జీవితంలో మంచి చెడులుంటాయి. వాటిని దాటి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘‘చంద్రయాన్ రాకెట్ ప్రయోగంతో ప్రపంచదేశాలను ఇండియా తన వైపు తిప్పుకునేలా చేస్తే.. తన బాడ్మింటన్ రాకెట్‌తో వరల్డ్ చాంపియన్‌గా ఎదిగిన పి.వి.సింధు అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కన్నడ, తెలుగు ప్రజలు అన్నదమ్ములుగా కలిసి మెలిసి ఉంటుంటారు. మన తెలుగు సినిమాకు కన్నడ రాష్ట్రం ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను వారి సినిమాలాగానే ఫీల్ అయ్యి చూస్తారు. అలాగే ఒక మంచి కన్నడ సినిమా తెలుగులో విడుదలైతే నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి మంచి ఉదాహరణ ‘కె.జి.యఫ్’. అలాగే పహిల్వాన్‌ను కూడా అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. కిచ్చాసుదీప్‌గారు ప్యాన్ ఇండియా స్టార్ ఆయన ఏ భాషలో నటించినా అక్కడి ప్రేక్షకుల మనసులను ఆకట్టుకున్నారు. ఆయన పెద్ద హీరో. అయినా కూడా ఆ బౌండరీలో ఉండరు. మంచి క్యారెక్టర్ వస్తే చాలు ఏ రాష్ట్రానికైనా వెళ్లి నటించి ఆ పాత్రకు న్యాయం చేస్తారు. ఆయనలాంటి గొప్ప నటుడు మన దగ్గర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు నార్త్, సౌత్ సినిమాలనే తేడాలుండేవి. కానీ ఇప్పుడలా లేవు. అంతా ఇండియన్ సినిమాలే అయ్యాయి. అక్కడి వారు ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ వాళ్లు అక్కడ యాక్ట్ చేస్తున్నారు. తెలుగు సినిమా డబ్బింగ్ రేట్స్ అంటే మన సినిమాను ఉత్తరాదివారు గొప్పగా చూస్తున్నారు. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటిగా మారింది. సాయికొర్రపాటిగారితో నాకు మంచి జర్నీ ఉంది. నా ‘లెజెండ్’ సినిమాకు నిర్మాత. ఆయన మంచి మూవీ లవర్. మన తెలుగులో గొప్ప సినిమా చేసి ఇతర భాషల్లో నటీనటులకు చూపించాలనుకుంటారు. అలాగే ఇతర భాషల్లోని గొప్ప సినిమాలను మన తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. ఆయన తాపత్రయానికి ఉదాహరణే పహిల్వాన్. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఈ సినిమా కోసం సుదీప్‌గారు చాలా వెయిట్ తగ్గారు. మన హీరోలు కూడా పాత్ర కోసం వెయిట్ తగ్గుతున్నారు. మన ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్, బన్నీ, మొన్నటికి మొన్న రామ్ ఇస్మార్ట్ శంకర్ కోసం వెయిట్ తగ్గారు. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం 11 కిలోలు తగ్గారు. ఈ హీరోలందరూ బాడీని మౌల్డ్ చేసుకుని నటిస్తున్నారు. అలాగే సుదీప్‌గారు కూడా పహిల్వాన్ సినిమా కోసం శరీరాకృతిని మార్చుకుని నటించారు. ఆయన ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఇది. చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ‘‘పహిల్వాన్ ప్రీ రిలీజ్ వేడుకకి విచ్చేసిన పి.వి.సింధుగారికి థ్యాంక్స్. ఆమె సాధించిన విజయం పట్ల మేం అందరం గర్వంగా ఉన్నాం. నాకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమాభిమానాలను మరచిపోలేను. రాజమౌళిగారిని, ఆయన తెరకెక్కించిన ‘ఈగ’ చిత్రాన్ని నా లైఫ్‌లో మరచిపోలేను. సాయిగారు చాలా మంచి వ్యక్తి. మా స్నేహితుడు కృష్ణ దర్శక నిర్మాతగా చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. సపోర్ట్ అందించిన ఎంటైర్ యూనిట్‌కు థ్యాంక్స్’’ అన్నారు.
దర్శకుడు ఎస్.కృష్ణ మాట్లాడుతూ - పహిల్వాన్ షూటింగ్ హైదరాబాద్‌లోనే ఎక్కువగా జరిగింది. స్క్రిప్ట్ వర్క్‌తో పాటు రామోజీ ఫిలింసిటీలో సెట్స్ వేసి 80శాతం షూటింగ్ చేశాం. సాయి కొర్రపాటిగారికి థ్యాంక్స్. ఆయన టీజర్‌ను చూశారు. ఆయనకు నచ్చడంతో తెలుగులో ఈ సినిమాను భారీ లెవల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు.. అన్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. కె.జి.యఫ్ తెలుగులో ఎంత మంచి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అదే ఒరవడిని క్రియేట్ చేయడానికి ‘పహిల్వాన్’ సినిమా విడుదలవుతుంది. సుదీప్‌గారికి కన్నడలోనే కాదు..తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులున్నారు. ఆయన తెలుగులో చేసిన సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించాయి. అదే దారిలో పహిల్వాన్ కూడా పెద్ద విజయాన్ని సాధించాలి. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎస్.కృష్ణ దర్శకత్వంతో పాటు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి.. అన్నారు.
హనుమాన్ చౌదరి మాట్లాడుతూ - మా ‘పహిల్వాన్’ కుస్తీతో పాటు బాధ్యతలను కూడా తీసుకుంటారు. మా కృష్ణగారు పహిల్వాన్‌ను అంతే బాగా తీర్చిదిద్దారు. అలాగే సుదీప్‌గారు తన నటనతో అంతేలా పాత్రకు ప్రాణం పోశారు. అర్జున్ జన్యాగారు మంచి సంగీతాన్ని అందించారు. వారాహిలో విడుదలైన కె.జి.యఫ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో ఈ సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్, కబీర్ దుహన్ సింగ్, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
By September 08, 2019 at 06:39AM
No comments