Breaking News

‘సైరా’ ప్రీ రిలీజ్ వేదిక ఫిక్స్.. అతిథులెవరంటే..!


మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగు‌తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బారి బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా అదే రేంజ్‌లో చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్రబృందం.. చిరు కూడా ఇంటర్వ్యూలు మొదలెట్టేశారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయానికొస్తే.. ఈ ఈవెంట్‌‌ను సైరా నర్సింహారెడ్డి పురిటిగడ్డ అయిన కర్నూలు జిల్లాలో నిర్వహించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు కూడా షురూ చేశారని తెలుస్తోంది.

అంతేకాదు.. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాలీవుడ్ బిగ్‌బీ.. అమితాబ్, రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని సమాచారం. అయితే ఇందులో ఏ మాత్రం నిజానిజాలున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే మరి.



By September 08, 2019 at 03:54AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47334/chiranjeevi.html

No comments