Breaking News

ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు.. నాన్నతో చెబుతానన్న కొడుకుని దారుణంగా చంపేసింది


కుటుంబాన్ని భర్త పట్టించుకోకపోవడంతో మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టకున్న మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చే పనిచేసింది. నవమాసాలు మోసి ప్రసవ వేదన భరించిన కన్న కొడుకు కంటే ప్రియుడే ముఖ్యమనుకుంది. తాత్కాలిక సుఖం కోసం అందించే ప్రియుడి కోసం పేగు బంధాన్నే కాదనుకుంది. ప్రియుడితో కలిసి కొడుకును దారుణంగా చంపేసి ఏమీ తెలియనట్లు నటిస్తూ వచ్చింది. Also Read: జిల్లా మండలం ఆకుల గణపవరం గ్రామానికి చెందిన షేక్‌ ఇజ్వాన్‌(8) గత ఏడాది డిసెంబరు 15న అర్ధరాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. అతడి తల్లి సైదాబి అదే గ్రామానికి చెందిన వడ్డమాను శ్రీకాంత్‌రెడ్డికి చెందిన పొలంలో కూలి పనులకు వెళ్లేది. ఆమె భర్త జాన్‌వలి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే తాగుడుకు బానిసైన జాన్‌వలి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆమెకు శ్రీకాంత్‌రెడ్డి.. సైదాబికి ఆర్థికంగా సాయం చేసేవాడు. దీంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: జావ్‌వలి ఇంట్లో లేని సమయంలో శ్రీకాంత్‌రెడ్డి సైదాబి వద్దకు వచ్చి రాసలీలలు కొనసాగించేవాడు. ఓ రోజు అసభ్యకర రీతిలో ఉన్న సమయంలో కొడుకు ఇజ్వాన్ ఇంట్లోకి వచ్చి చూశాడు. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని చెప్పడంతో ఆ జంట కంగారు పడింది. తన సంతోషానికి అడ్డొస్తున్న కొడుకు అడ్డు తొలగించుకోవాలని సైదాబి నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడితో చెప్పగా అతడూ సరేనన్నాడు. డిసెంబర్ 15వ తేదీన ఇజ్వాన్‌ను బైక్‌పై ఎక్కించుకున్న శ్రీకాంత్‌రెడ్డి తన పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ సైదాబి కొడుకు కాళ్లు పట్టుకోగా శ్రీకాంత్‌ అతడి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని సమీపంలోని పొదల్లో పడేసి వెళ్లిపోయారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఎలాంటి క్లూ లభించకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. గుంటూరు గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి ఇటీవల పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టడంతో సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి ఈ కేసును ఛేదించాలని పిడుగురాళ్ల సీఐ రత్తయ్యకు సూచించారు. దీంతో ఆయన దర్యాప్తు వేగవంగం చేశారు. Also Read:


By September 20, 2019 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-woman-brutally-kills-son-due-to-illegal-affair/articleshow/71212409.cms

No comments