Breaking News

కీచక ప్రొఫెసర్.. పిల్లలను చూసేందుకు వెళ్లి మాజీ భార్యపైనే రేప్


విద్యార్థులకు పాఠాలు చెబుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తిలో ఉన్న ప్రొఫెసర్ దారి తప్పాడు. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నప్పటికి తనలోని కీచకుడిని తెరపైకి తెచ్చి మాజీ భార్యపైనే అత్యాచారం చేశాడు. దీంతో నిందితుడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. Also read: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ యూనివర్శిటీలో పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్ 2017లో భార్యకు వాట్సాప్‌ విడాకులు ఇచ్చి ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఆమె పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. భర్త చేసిన అన్యాయానికి నిరసనగా అప్పట్లోనే ఆమె ఆలీగఢ్‌ యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో బాధనంతా భరిస్తూ పిల్లలతో కలిసి నివసిస్తోంది. అయితే పిల్లలను చూడాలన్న సాకుతో అతడు అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లేవాడు. Also read: ఈ నేపథ్యంలోనే ఆగస్టు 29వ తేదీన ఆమె ఇంటికి వెళ్లిన ప్రొఫెసర్ మాజీ భార్య ఒక్కతే ఉండటాన్ని గమనించి లైంగిక కోరిక తీర్చాలని కోరాడు. ఆమె తిరస్కరించడంతో తుపాకీతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అలీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారించిన పోలీసులు నిందితుడిపై ఐపీసీ 376(అత్యాచారం), బెదిరింపులు(506) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.


By September 27, 2019 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-aligarh-university-professor-arrested-for-raping-ex-wife/articleshow/71322228.cms

No comments