‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ లుక్: నాన్నే కుర్రాడైతే..!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiznnF_dSNJNvA7yvMGlS2F8Mp5p3q7_b2yjJ-12wu0tJ_HB8Frugro8tY7agbK2o40802tzyVnkF7SLEmUEF0SRc3h4PFPyKfHtXXVQw_fa3WMWAne87UyT4uozsGJ74M24g_TnYYg4Wc/s320/Movie.jpg)
![](https://telugu.samayam.com/photo/71091509/photo-71091509.jpg)
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. సత్యరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను బుధవారం రాత్రి విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ కనిపించారు. ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటిస్తోన్న సత్యరాజ్.. పోస్టర్‌లో చిన్న పిల్లాడిలా చిందులేస్తున్నారు. వర్షంలో గొడుగును గాల్లోకి ఎగరేసి నీటిలో గెంతుతున్నారు. వెనకే తేజూ జాగ్రత్త అన్నట్టుగా తండ్రి ఉత్సాహాన్ని నవ్వుతూ ఆస్వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఫీల్ గుడ్ ఇంప్రషన్‌ను కలిగించింది. ‘చిత్రలహరి’తో ఫామ్‌లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ‘ప్రతిరోజూ పండగే’తో మరో ఎమోషనల్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. మారుతి సినిమా అంటే కామెడీకి డోకా ఉండదు. ఇలా కామెడీ, ఎమోషన్స్, డ్రామాతో కూడి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మెగా అభిమానులతో సినీ ప్రేమికులు డిసెంబర్‌లో థియేటర్‌లో చూడబోతున్నారు. కాగా, ఈ మోషన్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న సాయి ధరమ్ తేజ్.. ‘‘వర్షంలో డ్యాన్స్ చేయడానికి మీకు వయసుతో సంబంధం లేదు. లాలీపాప్ తినడానికి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా వయసు ఎంతన్నది పట్టించుకోవాల్సిన అవసరంలేదు’’ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read:
By September 12, 2019 at 10:40AM
No comments