నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్టిచ్చారు: అడివి శేష్
`ఎవరు` చిత్రాన్ని నా కెరీర్ హయ్యస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన అందరికీ థ్యాంక్స్ - అడివి శేష్
అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందిన థ్రిల్లర్ `ఎవరు`. వెంకట్ రామ్‌జీ దర్శకుడు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఆగస్ట్ 15న సినిమా విడుదలైంది. సినిమా నాలుగో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
నవీన్ చంద్ర మాట్లాడుతూ - అరవిందసమేత` చిత్రం తర్వాత నన్ను అందరూ బాల్ రెడ్డి అని పిలిచారు. ఈ `ఎవరు` సినిమా తర్వాత అందరూ అశోక్ అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన వారందరూ బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. నటీనటుల గురించే కాదు.. ప్రతి ఒక క్రాఫ్ట్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. మా సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టింది. మరోసారి సినిమాను చూసి థ్రిల్ అవండి. చాలా కాలం ముందు మాట్లాడిన నా స్నేహితులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు`` అన్నారు.
శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - ``మంచి టీమ్ వర్క్ కలిసి ఇంత దూరం ట్రావెల్ చేశాం. ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. సినిమా చూసిన అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరు సినిమా కోసం చేసిన స్పెషల్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. త్వరలోనే మేజర్ సినిమాకు వర్క్ చేయబోతున్నాను. శేష్‌తో కలిసి ఆ సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది`` అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసుల మాట్లాడుతూ - ``అరకులో ఒక థియేటర్ ఉంది. అందులోనూ `ఎవరు` సినిమానే రన్ అవుతుంది. అక్కడ నుండి సినిమా చూసిన నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి చెప్పారు. చాలా సంతోషంగా ఉంది`` అన్నారు.
నిహాల్ మాట్లాడుతూ - ``సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఈరోజు వరకు నా ఫోన్ మోగుతూనే ఉంది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. శేష్ బిగ్గెస్ట్ హిట్ అని అందరూ మెచ్చుకుంటున్నారు. నటుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాను. చూసినవాళ్లు మళ్లీ మళ్లీ చూసి మెచ్చుకుంటున్నారు. `` అన్నారు.
అడివిశేష్ మాట్లాడుతూ - గూఢచారి` లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను చాలా చోట్ల ఎవరు క్రాస్ చేసిందని తెలిసింది. నేను చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. సినిమా మూడో వారంలో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. బుక్ మై షోలో కూడా ఇంకా బుకింగ్స్ అవుతున్నాయి. `మేజర్` సినిమాను మహేశ్‌బాబుగారి బ్యానర్‌తో కలిసి కో ప్రొడ్యూస్ చేస్తున్న సోనీ పిక్చర్స్ ఎవరు సినిమాను బాలీవుడ్‌లో పెద్ద క్రిటిక్స్ సహా చాలా మందికి చూపించారు. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్ చేశారు. `ఇన్విజబుల్ గెస్ట్`, `బద్లా` సినిమా చూశాం. కానీ మీరు వాటికి డిఫరెంట్‌గా, ఫ్రెష్‌గా ఈ సినిమా చేశామని అందరూ అప్రిషియేట్ చేశారు. `బద్లా` సినిమా చూసిన వారికి కూడా ఎవరు సినిమా బాగా నచ్చింది. వినాయక చవితి సందర్భంగా సినిమా నాలుగో వారంలోకి సినిమా ఎంటర్ అవుతుంది. సినిమా స్క్రీన్స్ కూడా పెరగుతుండటం విశేషం. నాలుగు వారాల సినిమా అని డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. కానీ ఇప్పుడు సినిమా నాలుగు వారాలను కూడా దాటబోతుందని వారే అనుకుంటున్నారు. నా కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది`` అన్నారు.
By September 02, 2019 at 06:14AM
No comments