ఢిల్లీలో కూలిన నాలుగంతస్తుల భవనం.. ఇద్దరి మృతి
దేశ రాజధాని ఢిల్లీలో వినాయక చవితి రోజు విషాదం నెలకొంది. ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో హీనా(22) మహిళతో పాటు మరొకరు మృతిచెందారు. మరికొందరు భవన శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న అనుమానంతో గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి మొదటి అంతస్తులో స్థానికులు ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కూలిపోయిందని తెలిపారు.
By September 03, 2019 at 08:07AM
No comments