Breaking News

దసరా పండక్కి పుట్టింటికి పంపలేదని వివాహిత అదృశ్యం


బతుకమ్మ, దసరా పండగలకు భర్త పుట్టింటికి పంపలేదన్న కోపంతో ఓ వివాహిత ఇద్దరు బిడ్డలతో కలిసి అదృశ్యమైన ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో జరిగింది. నాగర్‌కర్నూలు జిల్లా అయాతపూర్ గ్రామానికి చెందిన రాములు తాజ్‌మహల్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. రాధ అనే మహిళను కొన్నాళ్ల క్రితం చేసుకుని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని ఇందిరానగర్‌లో అద్దెకుంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. రాధ ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. Also Read: సందర్భంగా పుట్టింటికి వెళ్లానని రాధ ఈ నెల 25వ తేదీన భర్తను కోరగా నిరాకరించాడు. ఇన్ని రోజులు ముందు వెళ్లడం ఎందుకని, పండుగ ముందురోజు వెళ్దామని చెప్పడంతో ఆమె మనస్తాపం చెందింది. 26వ తేదీన రాములు డ్యూటీకి వెళ్లిన వెంటనే రాధ ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన రాములుకి భార్, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించాడు. అత్తారింటికి ఫోన్ చేసి ఆరా తీయగా అక్కడికి రాలేదని చెప్పారు. Also Read: దీంతో రాములు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాధ, ఆమె పిల్లల కోసం గాలింపు చేపట్టారు.


By September 30, 2019 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-wife-missing-with-daughters-after-husband-refuses-go-to-her-mothers-house/articleshow/71369069.cms

No comments