వేణుమాధవ్ మా కుటుంబ సభ్యుడి లాంటోడు: ఎర్రబెల్లి
హైదరాబాద్: వేణుమాధవ్ అకాల మరణం తనను కలచి వేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి అన్నారు. మౌలాలిలోని వేణుమాధవ్ నివాసానికి వెళ్లి మంత్రి.. పార్థీవ దేహానికి నివాళులు అర్పించి, అతడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వేణుమాధవ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. వేణుమాధవ్ తమకు కుటుంబ సభ్యుడు లాంటోడన్నారు. ఎన్టీఆర్ ప్రచార రథంలో వేణుమాధవ్ సేవలు అందించాడని.. తన ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవాడని ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని అన్నారు. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమలో వేణుమాధవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. మరో మంత్రి ఈటల రాజేంద్ర కూడా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మౌలాలిలోని వేణు మాధవ్ నివాసానికి వెళ్లి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పలువురు టీడీపీ నేతలు సైతం వేణు మాధవ్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
By September 26, 2019 at 12:32PM
No comments