చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
పోరాట స్పూర్తిని పునికి పుచ్చుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మను మహిళ ఉక్కు మహిళ అంటూ కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో గజ్వేల్‌లో కోటి రూపాయలతో ఐలమ్మ భవనం నిర్మిస్తున్నామన్నారు. మరో పదిహేను రోజుల్లో రూ.40 లక్షలతో ఈ భవనం చుట్టూ కాంపౌండ్, కిచెన్ షెడ్ , టాయిలెట్స్ తదితర నిర్మాణాలు జరుపుతామని తెలిపారు. రజకులు కోసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం ఆశయమన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రజకులకు సూచించారు. ఆర్థికంగా ఎదిగేలా డ్రైక్లినింగ్, డ్రైయర్స్ లాంటివి చేసుకోవాలని రజకులకు హరీశ్ సూచించారు. సోడాతో బట్టలు ఉతకడం వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన తరహాలోనే గజ్వేల్‌లో కూడా మోడల్ ధోభీ ఘాట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
By September 26, 2019 at 12:58PM
No comments