Breaking News

ప్రియుడితో నయనతార సెల్ఫీ.. ముఖం దాచుకోవడం ఎందుకో?


లేడీ సూపర్‌స్టార్ నయనతారకు అన్ని విషయాల్లోనూ మద్దతు తెలుపుతూ ఆమెకు తోడుగా నిలుస్తున్నారు ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్. నయన్, విఘ్నేశ్ ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ ఆడియో లాంచ్ కార్యక్రమంలో విఘ్నేశ్‌‌ను నయన్.. ‘ఫియాన్సే’ అని సంబోధించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఇప్పుడు విఘ్నేశ్, నయన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. సినిమాకు 1981లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నెట్రికాణ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాను అప్పట్లో కే బాలచందర్ తెరకెక్కించారు. సినిమా టైటిల్‌ను వాడుకుంటామని విఘ్నేశ్.. బాలచందర్‌కు చెందిన కవితాల్య ప్రొడక్షన్స్‌ను కోరారు. ఈ సినిమాకు విఘ్నేశ్ నిర్మాతగా వ్యవహరిస్తు్న్నారు. ఈ విషయాన్ని విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ.. నయన్‌తో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ‘ఇద్దరం కలిసి మరోసారి షూటింగ్ చేస్తున్నాం. అయితే ఈసారి మా రోల్స్ వేరు. త్వరలో సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే వీరి ప్రేమ విషయం అందరికీ తెలిసిపోయాక కూడా నయన్ ఫొటోలో ముఖం చూపించకుండా చేత్తో కవర్ చేసుకున్నారు. ఎవ్వరికీ తెలీకుండా ఉండటానికా లేక పాత్ర కోసం ఆమె ముఖానికి ఏమన్నా చేయించుకున్నారా అన్నది నయన్‌కే తెలియాలి. దాదాపు ఐదేళ్ల నుంచి విఘ్నేశ్, నయన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఎటూ ఇద్దరూ ఫొటోలు పోస్ట్ చేస్తూ తమ ప్రేమ విషయం బయటపెట్టేస్తు్న్నారు కాబట్టి 2020లో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విఘ్నేశ్ తన ఇంట్లోవారికి నయన్‌ను పరిచయం చేశారు. విఘ్నేశ్ కంటే ముందు నయన్‌ తమిళ నటుడు శింబుతో ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరు విడిపోయారు. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాను నయన్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేశారు. నయన్ బ్యాంకాక్‌కు వెళ్లి మరీ ప్రభుదేవా పేరును పచ్చబొట్టు వేయించుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ బ్రేకప్ అయ్యారు. ప్రభుదేవా టాట్టూను తొలగించుకోవడానికి నయన్ బ్యాంకాక్ వెళ్లారు కూడా. ఇప్పుడు నయన్.. విఘ్నేశ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. త్వరలో నయన్.. విఘ్నేశ్‌తో సెటిల్ అయిపోతారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోపక్క నయన్ ‘సైరా నరసింహారెడ్డి’, ‘దర్బార్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రజనీకాంత్, జోడీగా నటిస్తున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్ ప్రాసెస్‌లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి దర్బార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


By September 16, 2019 at 12:25PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tamil-director-vignesh-sivan-posts-selfie-with-girl-friend-nayanthara-but-why-did-she-covered-her-face/articleshow/71146423.cms

No comments