ఫేస్‌బుక్ ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. కోపంతో మనవడి హత్య
భర్త చనిపోవడంతో తల్లి, కుమారుడితో కలిసి నివసిస్తున్న మహిళ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజుల క్రితం అతడి దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో పరువు పోయిందని భావించిన మహిళ తల్లి మనవడిని నీళ్లలోకి తోసి చంపేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. Also Read: మాండ్య జిల్లా కేఆర్ పేటలోని మారుతినగర్‌కు చెందిన లక్ష్మి అనే మహిళ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. దీంతో ఆమె తల్లి సావిత్రమ్మ, కొడుకు ప్రజ్వల్(11)తో కలిసి నివసిస్తోంది. లక్ష్మికి ఇటీవల ఫేస్‌బుక్‌లో మంగళూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరూ తరుచూ ఛాటింగ్ చేసుకోవడంతో చనువు పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. లక్ష్మి అప్పుడప్పుడు మంగళూరుకు వెళ్లి ప్రియుడిని కలిసి వచ్చేది. ఈ క్రమంలో ఒకరికొకరు విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నారు. Also Read: ఈ విషయం తెలుసుకున్న సావిత్రమ్మ కూతురిని అడ్డదారులు తొక్కద్దని మందలించింది. దీంతో తమ సంతోషానికి తల్లి, కొడుకు అడ్డుగా ఉన్నారని భావించి కొద్దిరోజుల క్రితం ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. కూతురు చేసిన పనికి గ్రామంలో పరువు పోయిందని భావించిన సావిత్రమ్మ మనవడితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. సోమవారం ప్రజ్వల్‌ను స్కూల్ నుంచి తీసుకొచ్చి సమీపంలోని చెరువు వెళ్లింది. అక్కడ పిల్లాడి కాళ్లు, చేతులు కట్టేసి చెరువులోకి నెట్టేసింది. Also Read: ఆ తర్వాత తానుకూడా చెరువులోకి దూకేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా తన మనవడిని చెరువులోకి తోసేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గంటకు పైగా గాలించి ప్రజ్వల్ మృతదేహాన్ని వెలికితీశారు. కొడుకు చనిపోయాడన్న వార్త తెలియగానే లక్ష్మి ప్రియుడితో సహా గ్రామానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. జిల్లా ఎస్పీ పరశురామ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరోవైపు లక్ష్మీ, ఆమె ప్రియుడి పోలీసులకు విచారణ చిక్కకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
By September 25, 2019 at 11:06AM
No comments