Breaking News

Alwar అత్యాచారాల అడ్డా.. 24గంటల్లో మూడు గ్యాంగ్ రేప్‌లు


రాజస్థాన్‌లోని ప్రాంతంలో కామాంధులు రెచ్చిపోయారు. 24గంటల్లోనే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బాధితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. Also Read: శనివారం రాత్రి ఆల్వార్‌లోని తనగజీ అటవీ ప్రాంతంలో 15ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకున్న బాలిక పారిపోతూ లోతైన గుంతలో పడిపోయింది. కేకలు విన్న స్థానికులు ఆమెను రక్షించి కామాంధులను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఐపీసీ 376డి(సామూహిక అత్యాచారం) సెక్షన్ కింద నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఆల్వార్ రూరల్ ఏఎస్పీ విష్ణురామ్ బిష్ణోయ్ తెలిపారు. Also Read: శుక్రవారం రాత్రి ఆల్వార్‌లోని ధబ్లా ప్రాంతంలో 16ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకాన్ని వీడియో తీసి ఎవరికైనా చెబితే దాన్ని బయటపెడతామని బెదిరించారు. బాధితురాలు ధైర్యం తెచ్చుకుని శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురు కామాంధులను అరెస్ట్ చేశారు. Also Read: మరో ఘటనలో... రైనీ ప్రాంతంలో నివాసముంటున్న 35ఏళ్ల మహిళపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


By September 30, 2019 at 12:56PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-gangrapes-in-alwar-rajasthan-in-24-hours/articleshow/71371356.cms

No comments