Breaking News

రూ.6కోట్ల చిట్టీల సొమ్ముతో పరారీ.. దంపతుల అరెస్ట్


జిల్లా నర్సాపురంలో చిట్‌ఫండ్ పేరుతో ప్రజల నుంచి భారీగా నగదు సేకరించి పరారైన భార్యభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కంచన రమేష్, దివ్య దంపతులు చిట్‌ ఫండ్‌తో పాటు అధిక వడ్డీ ముసుగులో అనేక మంది వద్ద నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నారు. వడ్డీ సక్రమంగా ఇవ్వకపోవడంతో రుణదాతలు నిలదీయగా రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతులతో పాటు వారికి సహకరించిన సమీప బంధువు సూరజ్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.20లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రమేశ్, దివ్య దంపతుల చేతిలో మోసపోయిన వారి సంఖ్య 60కి పైగానే ఉన్నట్లు పోలీసులు నర్సాపురం డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. వీరు నాలుగు సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.6కోట్లకు పైగా నగదు వసూలు చేసినట్లు తెలిపారు. దీనికి తోడు స్నేహితులు, బంధువుల వద్ద శుభకార్యానికి వెళ్తున్నామని చెప్పి నగలు తీసుకుని ఉడాయించారు. రెండు నెలలుగా దంపతులు తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరి కదలికలపై నిఘా పెట్టి బుధవారం అరెస్ట్ చేశారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్మును వీరి ఎక్కడ దాచారన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.


By September 19, 2019 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-godavari-couple-arrested-for-cheating-people/articleshow/71196380.cms

No comments