Breaking News

బన్నీ కోసం సుక్కు 4 వెర్షన్‌ల కథ?


‘రంగస్థలం’కి ముందు సుకుమార్ చాలా కొత్తగా డిఫరెంట్‌గా సినిమాలు తీసేవాడు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో తికమక పెడుతూ సినిమాలు చేసేవాడు. కానీ రంగస్థలం సినిమా స్ట్రెయిట్ నరేషన్‌తో కూడుకుంది కాబట్టి ఈసినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సుక్కు కెరీర్‌లోనే కాదు రామ్ చరణ్ కెరీర్‌లో కూడా ఈమూవీ బిగ్గెస్ట్ హిట్.

ఈమూవీ అంతటి హిట్ అవ్వడంతో సుక్కు నెక్స్ట్‌పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. మహేష్‌తో స్మగ్లర్ బ్యాక్ డ్రాప్‌తో సుక్కు సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్కవుట్ అవ్వలేదు. అందుకే వీరి కాంబినేషన్‌లో సినిమా క్యాన్సల్ అయిందని ఇన్సైడ్ టాక్. రంగస్థలంతో వచ్చిన ఇమేజ్ కాస్త మళ్ళీ అక్కడ డౌన్ అవుతుందో అని ఆచి తూచి అడుగులేస్తున్నాడు సుక్కు.

ఈ క్రమంలోనే సుక్కు బన్నీతో స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బన్నీకి కథ నచ్చడంతో సుక్కు కథను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సుక్కు మూడు వర్షన్స్ రాసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా నాల్గవ వర్షన్ రాసుకుంటున్నాడు. అక్టోబర్‌లో ఈమూవీ‌ని లాంచ్ చేయాలనీ చూస్తున్నారు. ఈలోగా సుక్కు నాల్గవ కంప్లీట్ చేస్తాడో చేయడో చూడాలి. మరి ఇంత గ్యాప్ తీసుకున్న సుక్కు.. బన్నీ మూవీతో మళ్లీ హిట్ అందుకోవాలని ఆశిద్దాం.



By September 09, 2019 at 07:05AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47355/allu-arjun.html

No comments