Breaking News

ఫోన్‌ పరిచయంతో రూ.1.40లక్షలు కొట్టేసిన కేటుగాడు


సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్‌మీడియాలో సైబర్ నేరగాళ్లు విసిరే వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాకు చెందిన ఓ వివాహిత ఇలాగే మోసపోయి ఇప్పుడు లబోదిబోమంటోంది. Also Read: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం మాధవపురానికి చెందిన ఓ వివాహితకు ఓ గుర్తుతెలియని వ్యక్తి రాంగ్‌ కాల్ ద్వారా పరిచయమయ్యాడు. తరుచూ ఫోన్లో మాట్లాడుకుంటుండటంతో ఇద్దరి మధ్యా చనువు పెరిగింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి తనకు అవసరం ఉందని చెబుతూ అప్పుడప్పుతూ తన అకౌంట్లో డబ్బులు వేయించుకునేవాడు. ఆ మహిళ ఈ విధంగా నాలుగు దఫాలుగా మొత్తం రూ.1.40లక్షలు అతడి బ్యాంక్ అకౌంట్లో వేసింది. Also Read: ఆ తర్వాత కూడా కొద్దిరోజుల పాటు మంచిగానే మాట్లాడిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేశాడు. అతడు ఫోన్ నంబర్ తప్ప ఇంకేమీ తెలియని ఆమె ఎన్నిరోజులు కాల్ చేసి స్విచ్ఛాఫ్ వస్తూనే ఉంది. దీంతో మోసపోయినట్లు ఆలస్యంగా బాధితురాలు భర్తకు చెప్పడంతో అతడు చీవాట్లు పెట్టి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడని తప్ప ఇంకేమీ వివరాలు ఆమె చెప్పలేకపోవడంతో పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. Also Read:


By September 27, 2019 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/east-godavari-woman-cheated-by-cyber-criminal-police-case-filed/articleshow/71321946.cms

No comments