గణేశ్ నిమజ్జనంలో విషాదం.. బోటు బోల్తా పడి 11 మంది మృతి
మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. భోపాల్‌లోని ఖట్లాపూర్‌లోని ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా... మరో ఐదుగురు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సిద్ధంగా ఉన్న రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. 11 మృతదేహాలను వెలికితీసి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. బోటులో పరిమితికి మించి ఎక్కడం వల్లే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. భాధాకరం: మంత్రి పీసీ శర్మ గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఈ ఘటన జరగడం బాధాకరమని మంత్రి పీసీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సంఘటనా స్థలం ఆయన సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
By September 13, 2019 at 08:45AM
No comments