YS Jagan.. రాజధాని రైతుల త్యాగాలు మర్చిపోవద్దు: కన్నా
ఏపీ రాజధానిపై రగడ కొనసాగుతోంది. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ సర్కార్ నిర్ణయాలపై కాస్త చూసీచూడనట్లు వ్యవహరించే బీజేపీ నేతలు కూడా రాజధాని విషయంలో సీరియస్‌గానే విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని మార్చే ఆలోచన చేస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఈ విషయంపై స్పందించారు. రాజధాని తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. తమ భూముల్లో రాజధాని వస్తుందన్న ఆశతో మూడు పంటలు పండే భూములను రైతులు త్యాగం చేశారని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ తీరుపైనా ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వం కొందరికే అన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. రాజధాని మార్చే ఆలోచన చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతులకు అండగా నిలుస్తామన్నారు. రాజధాని తరలింపుపై జోరుగా ప్రచారం సాగుతుండడంతో రాజధానికి భూములిచ్చిన రైతులు కన్నాను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులకు ఈ ప్రభుత్వం పింఛన్ కూడా ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు.
By August 23, 2019 at 11:54AM
No comments