వెంకీ చేతుల మీదుగా ‘RDX లవ్’ ఫస్ట్ లుక్
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘RDX లవ్’. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రధారులు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టరీ వెంకటేశ్ ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు ‘పవర్’ డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసి యూనిట్‌కి అభినందనలు తెలిపిన వెంకటేశ్‌కి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు.
శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్: సి.వి.రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: పరుశురాం
ఫైట్స్: నందు
కొరియోగ్రఫీ: గణేశ్ స్వామి
పి.ఆర్.ఓ: వంశీ శేఖర్
By August 04, 2019 at 05:26AM
No comments