RDX Love Teaser: సేఫ్టీలు వాడేస్తోన్న పాయల్.. మంచాలు విరిగిపోతున్నాయి!
‘‘RX 100’’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పంజాబీ బ్యూటీ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. ఒక్క సినిమాతో పాయల్ ఎక్కడేలని క్రేజ్ సంపాదించేసింది. అయితే, ఆ తరవాత తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకునే పాత్ర మాత్రం పాయల్ చేయలేదు. కానీ, ‘‘RX 100’’ రేంజులో మరోసారి వెండితెరపై అందాల ఆరబోతకు, రొమాన్స్‌కు సిద్ధమైపోయింది. పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. సి.కె.ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమాను విజయవాడలో ప్రారంభించారు. విజయవాడ, పోలవరం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటిం గ్ జరిపారు. విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. Also Read: టీజర్ పిచ్చ హాట్‌గా ఉంది. అడల్ట్ కాంటెంట్‌ను బాగా చొప్పించారు. పాయల్ రాజ్‌పుత్ అయితే మరోసారి రెచ్చిపోయింది. డైలాగులు కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. ‘‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి’’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. ఈ టీజర్‌లో ‘సేఫ్టీ’ అనే పదం ఎక్కువగా వినిపించింది. ఆఖర్లో ‘‘మీరెప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా?’’ అంటూ పాయల్ ప్రశ్నించింది. అలాగే మంచాన్ని కూడా విరగ్గొట్టారు. మొత్తంగా చూస్తే ఈ టీజర్ ఒక బూతు బొమ్మను తలపిస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఈ టీజర్‌ను కట్ చేశారో.. లేదంటే సినిమా మొత్తం ఇలానే ఉంటుందో తెలీదుకానీ, టీజర్‌ను మాత్రం అడల్ట్ కంటెంట్‌తో నింపేశారు. కాగా, ఈ చిత్రంలో వీకే నరేష్, నాగినీడు, ఆదిత్య మీనన్, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించారు. పరశురామ్ డైలాగులు రాశారు. రథన్ సంగీతం సమకూర్చారు. గణేష్ స్వామి సినిమాటోగ్రఫీ అందించారు.
By August 29, 2019 at 11:55AM
No comments