Prabhas Dual Role: ‘సాహో’ ట్విస్ట్.. ప్రభాస్ ద్విపాత్రాభినయం!
ఆగస్టు 30 తేదీ కోసం అభిమానులు కళ్లు కాయలుకాచేలే ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం తరువాత ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’ ఈనెల 30న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫ్యాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రన్ రాజా రన్ ఫేమ్ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన భారీ యాక్షన్ చిత్రానికి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినిమా విడుదలకు ముందు రివ్యూలు అందించే ప్రముఖ యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమర్ సంధు ‘సాహో’ చిత్రానికి పాజిటివ్ రివ్యూ అందించారు. ఇది ఖచ్చితంగా పైసా వసూల్ చిత్రం అవుతుందంటూ.. ప్రశంసలు కురిపించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీలో ఉన్నారు. Also Read: ఇదిలా ఉంటే ‘సాహో’ చిత్రంలో పెద్ద ట్విస్ట్ ఉండబోతుందని.. సినిమా చూసిన ప్రేక్షకులకు ఇదో పెద్ద సర్ ప్రైజ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇందులో ప్రభాస్.. రూ.2 వేల కోట్ల రాబరీ కేసును ఛేదించే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా.. మరో పాత్ర ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకరు పోలీస్.. మరొకరు దొంగనా? లేక పోలీసే దొంగగా మారతాడా? అసలు ఇందులో ప్రభాస్.. నిజంగానే ద్విపాత్రాభినయం చేస్తున్నారా? లేక ఇది పుకారేనా అన్నది ఆగస్టు 30కి తెలిసే అవకాశం ఉంది. Read Also:
By August 26, 2019 at 12:19PM
No comments