Breaking News

Paracetamol ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రమాదకర వైరస్ సోకుతుందా.. నిజమేంటి?


విషయం ట్యాబ్లెట్ వేసుకోవద్దని హెచ్చరిస్తూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. పారాసిటమల్ ట్యాబ్లెట్లలో ప్రాణాంతకమైన ‘మచుపో’ వైరస్ ఉందని, కొంతసేపటికే వైరస్ ప్రభావం చూపుతుందని వాట్సాప్‌లో మెస్సేజ్‌లు చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఇంగ్లీష్‌లో షేర్ అవుతున్న ఆ సందేశం ఇలా ఉంది. ‘పారాసిటమల్ పి/500 ట్యాబ్లెట్‌తో జాగ్రత్తగా ఉండండి. తెల్లగా తళతళ మెరుస్తున్నట్లుగా ఆ వస్తున్న ఆ ట్యాబ్లెట్లలో ప్రమాదకర ఉందని డాక్టర్లు ప్రూవ్ చేశారు. ప్రపంచంలో ప్రమాదకర వైరస్‌లలో మచుపో ఒకటి. ఆ మెస్సేజ్‌ను మీ బంధువులు, ఇతరులకు షేర్ చేయండి’ అని పోస్ట్ చేస్తున్నారు. పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకోవడంతో మచుపో వైరస్ సోకిందంటూ ఓ మహిళ, ఓ యువకుడి ఫొటోలు షేర్ అవుతున్నాయి. వారి వీపు, ముఖంపై ఎర్రటి దద్దర్లు వచ్చాయి. తొలుత ఫేస్‌బుక్, వాట్సాప్ లలో వైరల్ అయిన సందేశాన్ని అనంతరం ట్విట్టర్ యూజర్లు కూడా షేర్ చేస్తున్నారు. పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు.. ఈ విషయాన్ని త్వరగా అందరకీ తెలియజేయాలంటూ ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. నిజం పారాసిటమల్ వేసుకుంటే మచుపో వైరస్ సోకుతుందన్నది నిజం కాదు. అపోలో హాస్పిటల్‌లో సేవలందిస్తున్న సురన్‌జిత్ చటర్జీ అనే డాక్టర్‌ను టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సంప్రదించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ‘నాకు ఇప్పటివరకూ ఇలాంటి కేసు ఒక్కటి కూడా ఎదురుకాలేదు. కొందరు చేస్తున్న దుష్ప్రచారం ఇది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని’ ఆయన సూచించారు. ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టార్ డాక్టర్ గిరిష్ త్యాగిని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ సంప్రదించగా.. అది కేవలం వదంతి మాత్రమే. ఆధారం లేకుండా చేసే ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పారు. వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ ఇద్దరు సీనియర్ డాక్టర్లు ఛటర్జీ, డా. త్యాగిలు.. పారాసిటమల్ ట్యాబెట్లలో మచుపో వైరస్ లేదని నిర్ధారించారు. సింగపూర్ ప్రభుత్వం మచుపో వైరస్ మీద పరిశోధన చేస్తున్న సమయంలో ఆగస్ట్ 2, 2017న కొన్ని సూచనలు చేసింది. అయితే హెల్త్ సైన్స్ అథారిటీ (హెచ్‌ఎస్ఏ) వారు చేసిన ప్రకటనకు బదులుగా వేరే విషయాలను వారి పేరు మీదుగా వైరల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై వదంతులు వ్యాప్తిచెందాయి. మచుపో వైరస్ అనేది బొలివియన్ హెమరేజ్ ఫీవర్ (బీహెచ్ఎఫ్). జ్వారం, నరాల నొప్పి, రక్తస్రావం లాంటివి వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు. అయితే ఇప్పటివరకూ దక్షిణ అమెరికాలో మాత్రమే ఈ వైరస్‌ బాధితులను గుర్తించారు. గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే.. గృహహింస బాధితురాలు అని, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా కార్యకర్త అని సమాచారం వస్తోంది. నిర్ధారణ పారాసిటమల్ పి-500 ట్యాబెట్లలో మచుపో వైరస్ లేదని టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ టీమ్ కనుక్కుని వివరాలు వెల్లడించింది. డాక్టర్లు, అధికారులు గానీ చెబితే ఇలాంటివి నమ్మాలని.. వదంతులు ప్రచారం చేయడం మంచిది కాదని సూచించారు.


By August 27, 2019 at 09:42AM


Read More https://telugu.samayam.com/latest-news/fact-check/news/do-paracetamol-tablets-really-contain-dangerous-machupo-virus/articleshow/68502964.cms

No comments