Breaking News

Imran Khan Trolled: ‘బతికించావ్ దేవుడా..’ ఇమ్రాన్ ఖాన్‌పై ఆనంద్ మహీంద్రా అదిరిపోయే ట్వీట్!


సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే బిజినెస్ దిగ్గజం మరోసారి తన సెన్సాఫ్ హ్యూమర్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఆనంద్ మహీంద్రా వేసిన పంచ్ అదిరిపోయిందట. నెటిజన్లు ఇమ్రాన్‌ను ఏకిపారేయడంతో పాటు బిజినెస్ దిగ్గజం చాతుర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది మొదట్లో ఇరాన్ పర్యటనకు వెళ్లిన మాట్లాడుతున్న ఓ వీడియోను మహీంద్రా ట్వీట్ చేస్తూ.. ‘ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని తనకు సోషల్ టీచర్‌గాగానీ, జాగ్రఫీ టీచర్‌గా కానీ చెయ్యకుండా చూసినందుకు దేవుడికి ధన్యవాదాలు’ అని అదిరిపోయే ట్వీట్ పంచ్ పేల్చారు. ఓ సమావేశంలో పాల్గొన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... జర్మనీ, జపాన్ దేశాలపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ‘సరిహద్దు దేశాల సంబంధాలు మెరుగ్గా వాణిజ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే జర్మనీ, జపాన్ దేశాలు లక్షలాది ప్రజలను హతమార్చాయి. సరిహద్దును పంచుకుంటున్న ఈ దేశాలు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హింసను ప్రేరేపించాయని, అనంతరం వ్యాపార ఒప్పందాలతో రాణించాయని’ ఇమ్రాన్ మాట్లాడిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయడంతో వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇమ్రాన్‌ను తమ కామెంట్లతో ఆటాడేసుకోగా.. తాజాగా మహీంద్రా ట్వీట్‌తో పాక్ ప్రధానిపై సెటైర్ల వర్షం కురుస్తోంది. జర్మనీ, జపాన్‌ల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉందని, ప్రధాని అయి ఉండి ఈ విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి నెటిజన్లకు ఆనంద్ మహీంద్రా గుర్తుచేశారు. ఇమ్రాన్ లాంటి వ్యక్తిని టీచర్‌గా ఇవ్వనందుకు దేవుడికి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసిన వీడియో విపరీతమైన వ్యూస్, రిట్వీట్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


By August 26, 2019 at 01:01PM


Read More https://telugu.samayam.com/business/business-news/anand-mahindra-trolls-pakistan-pm-imran-khan-for-his-poor-knowledge-of-geography/articleshow/70838673.cms

No comments