Hyderabad: కత్తులతో పొడిచి రౌడీషీటర్ దారుణహత్య

హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఆరుగురు దుండగులు పోచయ్య గౌడ్ అలియాస్ పోచి(35)ని కత్తులతో పొడిచి, బండరాయితో తలపై మోది చంపేశారు. నగరంలో కలకలం సృష్టించిన హత్య తాలూకు వివరాలిలా ఉన్నాయి. బోరబండలోని శివాజీనగర్‌లో నివాసముండే పోచయ్యగౌడ్‌పై గతంలో రౌడీషీట్ నమోదైంది. దందాలు చేస్తూ అందరితో గొడవలు పెట్టుకునే పోచయ్యకు పలువురితో వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కల్లు కాంపౌండ్‌కు వెళ్తున్న అతడిని ఆరుగురు దుండగులు వెంబడించి కత్తులతో పొడిచారు. అనంతరం తలపై బండరాయి మోది బైకులపై వెళ్లిపోయారు. ఈ హత్యతో భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. . మృతుడి శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.హత్యను ప్రత్యక్షంగా చూసి వారిని విచారించి వివరాలు ఆరా తీశారు. పోచయ్యకు బంధువులతో వివాదాలు ఉన్నాయని, పాతకక్షలతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు
By August 13, 2019 at 11:58AM
No comments