Breaking News

Evaru: అడివి శేష్‌కు మహేష్ అభినందనలు.. ‘మేజర్’ రిప్లై అదిరింది


అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. కొత్త దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదలైంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. విమర్శకులు మెచ్చిన ఈ సినిమాపై అల్లు అర్జున్ ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు సూపర్ స్టార్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. Also Read: తాజాగా ‘ఎవరు’ సినిమాను చూసిన మహేష్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఎవరు సినిమా చూశాను!!! ఒక మంచి కాన్సెఫ్ట్‌తో ఆద్యంతం ఉత్సుకతకు గురుచేసే థ్రిల్లర్ ఇది. చాలా బాగా డైరెక్ట్ చేశారు. అంతేబాగా తెరపై ఆవిష్కరించారు. ఇంత మంచి విజయం సాధించిన అడివి శేష్‌తో పాటు మొత్తం టీమ్‌కు అభినందనలు’’ అని మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు ట్వీట్‌కు అడివి శేష్ స్పందించారు. ‘‘సూపర్ స్టార్! స్క్రీన్ మీద, బయట మీరు ఇస్తోన్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు ఒక పెద్ద థాంక్యూ. బ్లాక్ బస్టర్ ‘ఎవరు’కి మీరిచ్చిన ప్రశంస మరొక ఆకర్షణ. ‘మేజర్’ విషయంలో మీరు గర్వపడతారని నేను కోరుకుంటున్నాను’’ అని అడివి శేష్ ట్వీట్ చేశారు. మహేష్ బాబు నిర్మాతగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ ప్రొడక్షన్‌తో కలిసి జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


By August 25, 2019 at 06:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/superstar-mahesh-babu-praises-adivi-seshs-evaru-movie/articleshow/70829008.cms

No comments