Breaking News

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్


కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకోబోతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మత ఘర్షణలకు తలెత్తే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్రాలను అప్రమత్తం చేయడం విశేషం. కేంద్ర హోం మంత్రి అధ్యర్యంలోని సీసీఎస్ కమిటీ సమావేశం కొద్దిసేపటి కిందట భేటీ అయ్యారు. ఇక, మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న నేతలకు దేశంలో ప్రతి పౌరుడు అండగా ఉంటాడని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న క్రమంలో క్రియాశీలక రాజకీయ నేతలు ప్రజల మధ్య ఉండాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో అనిశ్చిత, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, భారీగా భద్రతా బలగాల మోహరింపు, మాజీ సీఎంల గృహ నిర్బంధం తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కీలక ప్రకటన చేయనున్నారు. అనంతరం లోక్‌సభలో 12 గంటలకు ప్రకటన చేస్తారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన నేరుగా పార్లమెంటుకు చేరుకున్నారు. మరోవైపు, కశ్మీర్‌లోని ఉగ్రవాదుల్లో 80 శాతం మంది గతంలో రాళ్లు రువ్వేవారిగా పనిచేసినట్టు భద్రతాధికారులు పేర్కొన్నారు. రాళ్లు రువ్వే ఘటనలే ఉగ్రవాదులకు రిక్రూట్‌మెంట్ల్‌గా మారుతున్నాయని, వారిని గుర్తించే ఉగ్రబృందాలు వారికి నెమ్మదిగా భావజాలాన్ని జొప్పించి ఉగ్రశిక్షణకు పంపిస్తున్నాయి.


By August 05, 2019 at 10:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tension-continue-in-kashmir-issue-central-issues-alert-to-all-states/articleshow/70530697.cms

No comments