భార్య హత్యకు బంధువుతో కాంట్రాక్ట్.. అత్యాచారం చేసి ప్రాణం తీసిన కిల్లర్
వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి తనను హత్య చేస్తోందేమో అని భయపడిన భర్త బంధువు సాయంతో ఆమెనే హత్య చేయించిన ఘటన జిల్లా హవేళిఘణాపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో జరిగింది. హత్య కోసం భర్త నుంచి రూ.10వేల సుపారీ తీసుకున్న అతడి బంధువు ఆమెకు మద్యం తాగించి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఆగస్టు 17న జరిగిన హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే చేధించారు. Also Read: ఔరంగాబాద్ తండాకు చెందిన దేవ్లా ఉపాధి నిమిత్తం గతేడాది విదేశాలకు వెళ్లాడు. అతడి భార్య ముగ్గురు పిల్లలతో తండాలో నివసిస్తోంది. ఈ క్రమంలో స్థానిక యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇక్కడ లేకపోవడంతో పిల్లలను పట్టించుకోకుండా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. ఈ విషయం బంధువులు విదేశాల్లో ఉన్న దేవ్లాకు తెలిపారు. భార్య తనను మోసం చేస్తోందన్న ఆందోళనతో పాటు అక్కడ ఉపాధి సరిగా లేకపోవడంతో దేవ్లా ఇటీవల ఇంటికి వచ్చేశాడు. భర్త తిరిగొచ్చినా అతడి భార్య ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ విషయాన్ని దేవ్లా పెద్దల మధ్య పంచాయతీ పెట్టినా ఆమె ప్రవర్తన మార్చుకోలేదు Also Read: దీంతో దేవ్లాకు ఆందోళన పెరిగిపోయింది. భార్య తన ప్రియుడితో కలిసి తనను చంపేస్తుందేమోనని ఆందోళన పడ్డాడు. తాను ప్రాణాలతో ఉండాలంటే భార్యనే చంపేయాలని నిర్ణయించుకుని సమీప బంధువు రూప్‌సింగ్‌తో రూ.10వేలకు ఒప్పందం చేసుకున్నాడు. రూప్‌సింగ్ తన తోడల్లుడైన మదన్ సహకారం తీసుకుని 17వ తేదీన ఆమెతో మాటమాటా కలిపి బైక్‌పై ఎక్కించుకుని మెదక్ వెళ్లాడు. అక్కడ ఫస్ట్ షో చూసి సినిమా చూసి అనంతరం అవుసులపల్లి శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి ఆమెతో కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న ఆమెపై ఇద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె చీరతోనే ఉరేసి చంపేశారు. Also Read: భార్య హత్యకు గురైనట్లు తెలియగానే దేవ్లా కొత్త నాటనాకికి తెరలేపాడు. తీవ్రంగా ఏడుస్తూ తనకు, పిల్లలకు దిక్కెవరంటూ ఏడవడంతో స్థానికులంతా అతడి బాధ చూసి ఆవేదన చెందారు. అయితే దేవ్లా ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం కక్కేశాడు. దీంతో దేవ్లాతో పాటు రూప్‌సింగ్, మదన్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాడు.
By August 24, 2019 at 08:11AM
No comments