మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడు
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నీచపు ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కలివేముల పాపయ్య అనే వ్యక్తి గురువారం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: కాసేపటి తర్వాత చిన్నారి ఏడుస్తూ ఇంటికి చేరుకుని తల్లికి విషయం చెప్పింది. దీంతో ఆందోళన పడిన ఆమె భర్తకు విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఆరా తీసిన డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి గురువారం రాత్రి గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి పాపయ్యపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించలేదు. Also Read:
By August 24, 2019 at 08:41AM
No comments