బిగ్‌బాస్: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?
బిగ్ బాస్ సీజన్ 1 టైములో ప్రతి వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో ముందే తెలిసిది కాదు. కానీ సీజన్ 2 అండ్ 3 లో అయితే మనకి రెండు మూడు రోజులు ముందే తెలిసిపోతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఈ వీక్ అషు రెడ్డి బయటకు రానుందని సమాచారం.
నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మహేశ్, శివజ్యోతిలు సేవ్ అయినట్టు నాగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై అషు రెడ్డి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది. ఎందుకంటే అషు రెడ్డికి వోటింగ్ శాతం చాలా తక్కువ రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తుంది.
పైగా ఆదివారం జరిగే ఎపిసోడ్ ముందు రోజే చిత్రీకరిస్తుండగా, ఆడియన్స్‌గా పాల్గొనే వారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న సంగతిని ముందే బయటకు చెప్పేస్తున్నారు. అలా ఈ వారం అషు రెడ్డి ఎలిమినేట్ అయిందని చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో మరి కొన్ని గంటల్లో తెలియనుంది.
By August 26, 2019 at 05:15AM
No comments