భర్త, బావే మణికాంతిని చంపేశారు: మృతురాలి తల్లి

సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య మణికాంతి తల నరికి దారుణంగా చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగిచింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన విజయవాడలో కలకలం రేకెత్తించింది. సీసీ కెమెరా దృశ్యాలను చూసిన భయభ్రాంతులకు గరయ్యారు. అయితే భార్య తలను ఏలూరు కాలువలో పడేసిన నిందితుడు ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. మణికాంతి మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతదేహానికి నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే మణికాంతి తల కోసం పోలీసులు ఏలూరు కాలువలో తీవ్రంగా గాలిస్తున్నారు. కాలువలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఏకంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తల అక్కడి నుంచి కిందికి కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో కాలువను జల్లెడ పడుతున్నారు. మణికాంతి తల స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. అల్లుడు, అతడి అన్నే నా కూతురిని చంపారు: మణికాంతి తల్లి ప్రదీప్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తన కూతురు ఎన్నో బాధలు పడిందని మణికాంతి తల్లి వరలక్ష్మి చెబుతోంది. ప్రదీప్ అన్న, అక్క, బావ తమ కూతురిని ఎన్నో బాధలు పెట్టినా మౌనంగా భరించిందని తెలిపింది. ప్రదీప్ తరఫు వారు రూ.4లక్షలు కట్నం అడిగితే తాము రూ.లక్ష వరకు ఇచ్చామని తెలిపింది. ప్రదీప్‌తో పాటు అతడి అన్న, బావ కలిసే తన కూతురిని చంపేశారని ఆమె ఆరోపిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
By August 12, 2019 at 10:06AM
No comments