Breaking News

చరణ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈసినిమాను సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఈమూవీ అక్టోబర్ 2 న రిలీజ్ చేయనున్నారు. దాదాపు 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. ఆయన నటించడంతో ఈసినిమాకి హిందీలో కూడా మంచి మార్కెట్ వచ్చింది. ఇందులో అమితాబ్ నరసింహారెడ్డి గురువు పాత్ర గోసాయి వెంకన్న పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు.

తెలుగుతో పాటు ఈచిత్రం సౌత్ ఇండియా లో తమిళం, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ఈమూవీ బజ్ తీసుకుని రావడానికి నయనతార, విజయ్ సేతుపతి ని తీసుకున్నారు. ఇందులో నయన్ చిరు సరసన హీరోయిన్ గా నటిస్తుంది అలానే విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించాడు. మరో ముఖ్య పాత్రలో కిచ్చ సుదీప్ కూడా నటించారు. నిన్న రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో లో ఎవరు ఎటువంటి పాత్రలు చేస్తున్నారు అని అర్ధం అయిపోయింది. ఈ మేకింగ్ వీడియో మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్నా ఎమ్మో నర్తకి పాత్రలో నటిస్తోంది. అలానే నాగ బాబు కూతురు నిహారిక కూడా నటించింది.

తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ తమిళ వెర్షన్ టీజర్‌ను రజినీకాంత్‌తో, హిందీ వెర్షన్‌ టీజర్‌ను అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా, మాలయంలో పెద్ద స్టార్ తో రిలీజ్ చేయించాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్టు సమాచారం. ఇలా చేయడంతో ఆయా భాషల్లో సైరా పై అంచనాలు ఏర్పడతాయి అని రామ్ చరణ్ భావిస్తున్నారు. త్వరలోనే తమిళ, హిందీ, మలయాళం టీజర్ డేట్స్ ని ప్రకటించనున్నారు రామ్ చరణ్.



By August 16, 2019 at 07:09AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/47082/ram-charan-plan-work-out-with-syraa.html

No comments