Breaking News

హయత్‌నగర్ కిడ్నాప్‌ కేసులో కొత్తకోణం.. అనుకోకుండానే కిడ్నాప్ చేశాడట


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో బీఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. యువతిని తాను కిడ్నాప్ చేయాలని అనుకోలేదని, ఏదో అలా జరిగిపోయిందని నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల పోలీసులు తనకోసం జల్లెడ పట్టడం, మరోవైపు రాచకొండ పోలీసులు రూ.లక్ష రివార్డు ప్రకటించడంతో భయపడిన నిందితుడు యువతిని ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలిపెట్టి పారిపోయాడు. అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌ చేరుకున్న సోనీని స్నేహితురాలు గుర్తుపట్టి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చింది. Also Read: యువతిని వదిలేసినప్పటికీ పోలీసులు రవిశేఖర్ కదలికలపై నిఘా ఉంచారు. దీంతో మంగళవారం నెల్లూరు జిల్లా కావలి చెక్‌పోస్ట్ వద్ద కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని కారులో కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాలు తిప్పిన నిందితుడు ఆమెను అద్దంకిలో ఓ చోట ఉంచి నల్గొండ జిల్లా దామరచర్లలో ఎరువుల వ్యాపారిని బెదిరించి డబ్బులు నొక్కేశాడు. మళ్లీ అద్దంకి చేరుకుని యువతిని హైదరాబాద్ వెళ్లిపోవాల్సిందిగా చెప్పాడు. Also Read: ఆమెను వదిలించుకోవడంతో తనను ఇంకెవరు పట్టుకోలేరనుకుని దర్జాగా తిరుగుతున్న రవిశేఖర్‌కు రాచకొండ పోలీసులు ఒక్కరోజులోనే షాకిచ్చారు. విచారణలో భాగంగా పోలీసులకు ఆశ్చర్యపోయే విషయాలు చెప్పాడు నిందితుడు. అసలు తాను విద్యార్థినిని కిడ్నాప్‌ చేశాననే అనుకోలేదని, ఆమెకు ఎలాంటి హాని తలపెట్టకుండా మంచిగా మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు తిప్పడంతో ఆ యువతి కూడా తనను ఉద్యోగం కోసమే తీసుకొచ్చినట్లు అనుకుందని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా తన వద్ద, యువతి వద్ద సెల్‌ఫోన్ లేకుండా చేయడంతో తమ కదలికలు ఎవరూ గుర్తించకుండా జాగ్రత్త పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.


By August 01, 2019 at 11:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/i-didnt-want-to-kidnap-sony-kidnapper-ravi-sekhar-told-to-police/articleshow/70476806.cms

No comments