Breaking News

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’.. మరో కాంట్రవర్శీకి తెరలేపిన వర్మ


రామ్‌గోపాల్ వర్మ.. ఈ పేరే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. చేసే ప్రతి పని, తీసే ప్రతి సినిమా వివాదాస్పదం చేయడమే ఆయన నైజం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది. ఇటీవల ఆయన తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా ఆయన తీసిన సినిమా ఎన్ని వివాదాలు రేపిందో చూశాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నేపథ్యంలో చంద్రబాబును విలన్‌గా చూపిస్తూ ఆయన తీసిన సినిమా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రచ్చ చేసింది. ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వర్మ కొత్త చిత్రాన్ని తీస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్‌ తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను వర్మ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. వివాదాస్పదమైన పాత్రలతో వివాదం లేని సినిమా తీస్తున్నామంటూ ఆయన ప్రకటించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కూడిన కథాంశంతో దీన్ని తెరకెక్కిస్తున్నామని చెబుతూ టైటిల్ సాంగ్ లింక్‌ను షేర్ చేశారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం, అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కూడిన వీడియోలతో పాటు పలువురు కీలక అధికారులు, జర్నలిస్టుల ఫోటోలను కూడా సాంగ్‌లో చూపించారు. వివాదాల ద్వారా ఎక్కువ పబ్లిసిటీ పొందే వర్మ తాజాగా తన చిత్రానికి టైటిల్ ద్వారానే హైప్ తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్ని కాంట్రవర్శీలు రేపుతుందో చూడాలి.


By August 09, 2019 at 11:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kamma-rajyam-lo-kadapa-reddlu-title-song-released/articleshow/70600146.cms

No comments