Breaking News

వివాహేతర బంధంలో అనుమానపు చిచ్చు.. ప్రియురాలిని చంపి తానూ ఆత్మహత్య


పచ్చటి సంసారాలను వదులుకుని పెట్టుకుని సహజీవనం చేస్తున్నారు వారిద్దరు. అయితే అనుమానపు భూతంతో ఆ బంధానికి చెక్ పడింది. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. తాను కూడా ఆత్మహత్ చేసుకున్నాడు. వారి అక్రమ సంబంధం ఇద్దరి చావుతో విషాదంగా ముగిసింది. నగరానికి చెందిన గీతారాణి(38) అనే మహిళకు గతంలో ఆర్మీ జవానుతో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త దేశ సరిహద్దుల్లో పహారా కాస్తుంటే గీతారాణి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తే వివాహితుడు హమీద్(36) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త గీతారాణి నుంచి విడిపోయాడు. వారి బంధం గురించి తెలిసిన హమీద్ భార్య కూడా భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో అడ్డు తొలగిపోయిందనుకున్న ఆ జంట ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. ఇటీవల గీతారాణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న హమీద్ ఆమెను వేధిస్తున్నారు. గురువారం ఇంట్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి ఛాతి, తల నడుము భాగాల్లో చాకుతో పొడిచాడు. పెద్దగా కేకలు చేసుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన గీతారాణిని స్థానికులు చిత్తూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మరోవైపు హమీద్ దుర్గానగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విషం తాగి పడిపోయాడు. అతడిని ఆస్పత్రికి తరలించేలోగానే ప్రాణాలు కోల్పోయాడు. చిత్తూరు రెండో టౌన్ సీఐ యుగంధర్ ఈ ఘటన తాలూకు వివరాలు సేకరించిన కేసు నమోదు చేసుకున్నారు.


By August 09, 2019 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chittoor-man-stabs-woman-for-illegal-affair-issue-he-commits-suicide/articleshow/70601062.cms

No comments